గండిపేట, వెలుగు: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఓ ప్రయాణికుడు తన లగేజీలో గంజాయిని దాచిపెట్టి తీసుకువస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అనుమానం రావడంతో లగేజీని స్కానింగ్ చేయగా బ్యాగేజ్ కింది భాగంలో ప్రత్యేకంగా ప్యాకెట్లలో అమర్చిన 10 కిలోల గంజాయి బయటపడింది.
అధికారులు గంజాయితో పాటు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.కోటి వరకు ఉంటుందని తెలిపారు.
