వరలక్ష్మీ శరత్ కుమార్, నవీన్ చంద్ర, కృష్ణసాయి, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రల్లో సంజీవ్ మేగోటి దర్శ కత్వంలో బాలకృష్ణ మహారాణా నిర్మించిన చిత్రం 'పోలీస్ కంప్లైంట్'. జూన్ 12న థియేటర్స్ లోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
జులై 31 నుంచి ఈ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. మూఢనమ్మకాల నేపథ్యంలో కర్మ సిద్ధాంతాన్ని థ్రిల్లింగ్ కథనంతో చూపించిన ఈ చిత్రం యాక్షన్, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని దర్శక ని ర్మాతలు తెలియజేశారు. ఓటీటీలోనూ ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కుతుందని నమ్మకం ఉందని అన్నారు.
