ఇంటింటికి తిరుగుతూ కమ్యూనిటీ పోలీసింగ్పై అవగాహన..

ఇంటింటికి తిరుగుతూ కమ్యూనిటీ పోలీసింగ్పై అవగాహన..

కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసాపేట్ వడ్డెర బస్తీలో శనివారం సాయంత్రం పోలీసుల కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మాదాపూర్ జోన్ డీసీపీ శిల్పవల్లి అధ్వర్యంలో 232 మంది పోలీసు సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. తనిఖీలతో పాటు ఇంటింటికి తిరుగుతూ కమ్యూనిటీ పోలీసింగ్ పై అవగాహన కల్పించారు. కార్డాన్ సెర్చ్ అనంతరం డీసీపీ మాట్లాడుతూ.. సరైన పత్రాలు లేని 19 ద్విచక్ర వాహనాలు, నెంబర్ ప్లేట్ సరిగ్గా లేని 20 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని, అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, 11 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే నిషేధిత గుట్కా విక్రయిస్తున్న ఓ పాన్ షాప్, కిరాణా షాపుల నిర్వాహకులపై కేసు నమోదు చేశామని, అనుమతులు లేకుండా ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తున్న ఓ వ్యక్తితో పాటు, మరో ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని డీసీపీ శిల్పవల్లి తెలిపారు.