గచ్చిబౌలిలో జనసేన సభకు పోలీసుల అనుమతి నిరాకరణ

గచ్చిబౌలిలో జనసేన సభకు పోలీసుల అనుమతి నిరాకరణ

గచ్చిబౌలి, వెలుగు: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున జనసేన పార్టీ గచ్చిబౌలిలో నిర్వహించే సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. జూన్ 2న ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్​ కళ్యాణ్ ఆధ్వర్యంలో సంధ్య కన్వెన్షన్​లో ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ - జనసేన సాధక్​ సమ్మేళనం’ నిర్వహించేందుకు ఆ పార్టీ నేతలు ముమ్మర ఏర్పాట్లు చేసుకున్నారు. 

అనుమతి కోసం జనరల్​ సెక్రటరీ తాల్లూరి రామ్​ దరఖాస్తు చేసుకోగా, సైబరాబాద్​ పోలీసులు తిరస్కరించారు. రాష్ట్ర అవతరణ వేడుకల వల్ల పోలీసు బలగాల కొరత ఉంటుందని, శాంతిభద్రతలు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని శేరిలింగంపల్లి డీసీపీ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసుల నిర్ణయాన్ని సవాల్​ చేస్తూ తెలంగాణ జనసేన నేతలు హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొనడంతో రేపటి సభ నిర్వహణపై తీవ్ర సందిగ్ధత ఏర్పడింది. 

పార్టీ సభకు అనుమతి నిరాకరణ బాధాకరం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్‌తోపాటు ఇతర రాజకీయ పార్టీలు యథేచ్ఛగా సభలు నిర్వహించుకుంటుంటే, కేవలం జనసేనకే అడ్డంకులు సృష్టించడం బాధాకరమని తెలంగాణ జనసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.