జనగామ పోలీసులు భారీగా మోహరించారు. నిన్న(మంగళవారం) కార్యకర్తలపై లాఠీ చార్జ్ కు నిరసన ఇవాళ బీజేపీ చలో జనగామకు పిలుపునిచ్చింది. మరి కాసేపట్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు రానున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా గ్రేహౌండ్, స్పెషల్ పార్టీ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. లాఠీచార్జిలో గాయపడిన బిజెపి పట్టణ అధ్యక్షుడు పవన్ శర్మ, మరో ముగ్గురు జనగామ హాస్పిటల్ లో చికిత్సపొందుతున్నారు.

