తోట పవన్ పై దాడి చేసిన కేసులో నిందితుల అరెస్ట్ 

తోట పవన్ పై దాడి చేసిన కేసులో నిందితుల అరెస్ట్ 

వరంగల్ సిటీ యూత్ కాంగ్రెస్ నేత తోట పవన్ పై దాడి చేసిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి యాత్ర ముగిసిన తర్వాత పవన్ పై నలుగురు నిందితులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ఈ దాడి ఘటనపై హనుమకొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు. చెక్క సుమన్, రావుల కొలను నరేందర్,  గుడికందుల వినోద్ కుమార్, సిటిమోర్ సునార్ కృష్ణ అనే నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ దాడి కేసులో సంబంధం ఉన్న మిగితా నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. 

తోట పవన్ పై దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్, ఎన్ఎస్ యూఐ ఆధ్వర్యంలో కార్యకర్తలు పోలీస్ కమిషనరేట్ ను ముట్టడించారు. ప్రభుత్వానికి, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

కానిస్టేబుల్ పై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్ 

టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ పై  దాడికి పాల్పడిన శివ ప్రసాద్ అనే వ్యక్తిని సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. కమలాపూర్ మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన ఉప్పల శివప్రసాద్ రేవంత్ రెడ్డి పాదయాత్రలో పోలీస్ రోప్ దాటి చాలాసార్లు ప్రయత్నించడంతో పోలీసులు అతడిని అడ్డుకున్నారు. దీంతో రోప్ పార్టీ బందోబస్తులో ఉన్న కానిస్టేబుల్ సాధిక్ పాషాపై దాడి చేశాడు.