- రాత్రి పది గంటల వరకు స్టేషన్లో నిర్బంధం
కోల్‌బెల్ట్, వెలుగు: మందమర్రి పట్టణంలో మూడు బెల్ట్‌షాపులపై దాడి చేసి మద్యం బాటిల్స్ పగులగొట్టారంటూ పోలీసులు శుక్రవారం కొందరు మహిళలపై కేసులు నమోదు చేశారు. రాత్రి పది గంటల వరకు వారిని స్టేషన్లో ఉంచారు. బీఆర్ఎస్ నాయకుల ఒత్తిడితోనే పోలీసులు తమను రాత్రి పొద్దుపోయే వరకు స్టేషన్లో నిర్బంధించారని బాధిత మహిళలు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రామిల్ల రాధిక ఆధ్వర్యంలో మహిళలు పట్టణంలోని ఎమ్మెల్యే కాలనీ (ఊరురామకృష్ణాపూర్కు వెళ్లే రూట్)లోని మూడు బెల్ట్ షాపుల్లోని లిక్కర్ బాటిల్స్‌ను గుర్తించి పగులగొట్టారు.
ఈ సందర్భంగా బెల్ట్ షాపు నిర్వాహకులు, మహిళల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొంది. రాధికతో పాటు మహిళలపై బెల్ట్ షాపు నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మహిళలను అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. రాత్రి పది గంటల వరకు వారిని స్టేషన్లోనే ఉంచారు. ఆ తర్వాత మహిళలపై కేసు నమోదు చేశారు. విచ్చలవిడి మద్యం అమ్మకాలతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, వీటిపై ఎక్సైజ్, స్థానిక పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదన్నారు.
మంచిర్యాల జిల్లా మందమర్రిలో బెల్ట్‌షాపులపై దాడి చేసి మద్యం బాటిల్స్ పగులగొట్టారంటూ పోలీసులు మహిళలపై కేసులు నమోదు చేశారు. రాత్రి పది గంటల వరకు స్టేషన్లో ఉంచారు.
బెల్ట్‌షాపులపై దాడి చేశారని మహిళలపై కేసులు
