- జస్టిస్ సుదర్శన్ రెడ్డి
బషీర్‌బాగ్, వెలుగు: ఒకరి విశ్లేషణతో అందరూ ఏకీభవించాల్సిన అవసరం లేదని, కానీ ఆ అభిప్రాయాన్ని వ్యక్తపరిచే హక్కును పరిరక్షించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు కీలకమని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి అన్నారు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే రాజకీయాలు సమాజానికి ప్రమాదకరమని హెచ్చరించారు.
ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై జరుగుతున్న దాడులు, సోషల్ మీడియా ట్రోలింగ్, అక్రమ కేసులకు వ్యతిరేకంగా బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్ లో సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం.కోదండరామ్, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, సీనియర్ ఎడిటర్కె.శ్రీనివాస్, సీపీఎం లీడర్ఎస్.వీరయ్య హాజరయ్యారు. ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ మాట్లాడుతూ.. తన వ్యాఖ్యల్లో ఎక్కడా విద్వేషాన్ని రెచ్చగొట్టే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.
ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, కక్షపూరిత దాడులు, ట్రోలింగ్‌లకు ముగింపు పలకాలంటూ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది.
