ఒక ఓటరు కోసం 4 రోజులు..483 కి.మీ.ల ప్రయాణం

ఒక ఓటరు కోసం  4 రోజులు..483 కి.మీ.ల ప్రయాణం
  • కొండలు, అడవులు, గుంతల రోడ్లు దాటి మాలేగావ్ కు
  • వలస వెళ్లిపోయిన ఓటర్ సొకేలా తయాం గ్
  • ఓటేసేందుకు 200 కి.మీ. ప్రయాణించి గ్రామానికి

మాలోగావ్ (అరుణాచల్ ప్రదేశ్): ‘ గ్రామానికి 2 కిలోమీటర్ల కన్నా ఎక్కు వ దూరంలో పోలింగ్ స్టేష న్ ఉండకూడదు’ అనే ఎన్నికల నిబంధనను అమలు చేసేందుకు ఎలక్షన్ కమిషన్ ‘ఎంతదూరమైనా’ వెళ్తోంది. ప్రతి ఒక్క ఓటరుతో ఓటేయించాలనే సంకల్పంతో ఎన్నో ప్రయాసలను భరిస్తోంది.అరుణాచల్ ప్రదేశ్ లోని ఓ పోలింగ్ స్టేషన్ లో ఉన్నఒకే ఒక్క ఓటర్ కోసం పోలింగ్ సిబ్బంది నాలుగు రోజులపాటు 483 కిలోమీటర్లు ప్రయాణించడమే ఇందుకు నిదర్శనం.

చైనా సరిహద్దులో..

అరుణాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు 35 ఏళ్ల గమ్మర్ బామ్. చైనా సరిహద్దుల్లో ఉన్న మాలోగావ్ లో పోలింగ్ బూత్ ఏర్పాటు చేయడమే ఆయనకు అప్పజెప్పిన పని. ఢిల్లీకి సుమారు 2,575 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ గ్రామం. అక్కడికి వెళ్లాలంటే అడవులు,కొండలతో కూడిన దారిలో వెళ్లాలి. 2011 జనాభా లెక్కల ప్రకారం మాలోగావ్ లో ఐదుగురు నివసిస్తున్నారు . అయితే ఒక్కరు మాత్రమే ఓటర్​గా రిజిస్టర్ చేసుకున్నారు . ఆమె పేరు సొకేలా తయాంగ్. వయసు 42 ఏళ్లు.

రెండు రోజుల ముందే ప్రయాణం

తొలి దశ (ఏప్రిల్ 11) ఎన్నికలు ప్రారంభం కావడానికి రెండు రోజుల ముందుగా బామ్ టీం అంజావ్ జిల్లా హావాయ్ ప్రాంతం నుంచి ప్రయాణం మొదలుపెట్టింది. రెండు సెట్ల ఈవీఎంలు, కొన్నిపేపర్లు, బ్యాటరీతో నడిచే ఓ దీపం, ఇతర సామగ్రి తీసుకెళ్లారు . గుంతల రోడ్లు, కొండలు, గుట్టలు,దట్టమైన అడవుల గుండా ప్రయాణం సాగిం ది.మాలోగావ్ లో సొకేలా తయాంగ్ ఉండటం లేదని దారిలో కనిపించిన వారు చెప్పారు . వేరే ప్రాంతానికి వెళ్లిం దని చెప్పారు. అయితే వచ్చిన తర్వాత వెంటనే తిరిగి వెళ్లలేక, నిబంధనల ప్రకారం పోలింగ్ బూత్ ను బామ్ సెట్ చేశారు. ‘ఆమె కనిపిస్తే ఓటు వేసే రావాలని చెప్పం డి’ అని దారిలో ప్రజలకు చెప్పుకుంటూ వచ్చారు . రాత్రికి అక్కడ ఉన్నదేదో తిని పడుకున్నారు. పొద్దున్నే పోలిం గ్ డే.

 5 గంటలకే మాక్ పోలింగ్

తెల్లవారుజామునే లేచి, ఉదయం 5 గంటలకే బామ్ టీం మాక్ పోల్ నిర్వహించింది. ఇలా 50 మాక్ఓట్లు వేశారు. ఉదయం 8.30 గంటలకు సొకేలాతయాంగ్ వచ్చిం ది. దాదాపుగా 200 కిలోమీటర్లదూరం ప్రయాణించి కేవలం ఓటు వేయడానికే అక్కడికి వచ్చిందామె . రెండు నిమిషాల్లోనే ఆమె ఓటేయడం పూర్తయింది. తర్వాత పోలింగ్ సిబ్బందితో ఆమె సెల్ఫీలు దిగింది. తన ఒక్క ఓటు కోసం ప్రయాసలు పడి వచ్చిన పోలిం గ్ సిబ్బందికి థ్యాంక్స్ చెప్పిం ది. పోలింగ్ బూత్ మాత్రం సాయంత్రం 5 గంటలకు వరకూ ఉండాల్సిం దే. ఆ తర్వాత పేపర్ వర్క్ పూర్తి చేసుకుని మళ్లీ తిరుగు పయనమయ్యారు బామ్ బృందం తిరుగుప్రయాణానికి రోజు పట్టింది.

నాకు ఎంతో ఉత్సాహంగా, అదేసమయంలో ఆందోళనగా అనిపించింది.ఒకే ఓటరు. ఆమె ఓటు వేస్తే 100 శాతంపోలింగ్. వేయకుంటే సున్నా శాతం.- ఈవీఎంలను సెట్ చేసే రూపక్ తమాంగ్  

మాకు ఉద్యోగాలు కావాలని, ఇక్కడ అభివృద్ధి జరగాలని ఈ ఓటు ద్వారా మేం అడగాలనుకుంటున్నాం . మా ప్రాంతం ఇంకా అడవిలానే ఉంది. ఇక్కడ డెవలప్ మెంట్ జరగాల్సి ఉంది.- సొకేలా తయాంగ్

ఇంకొన్ని..

  • అండమాన్, నికోబార్ దీవుల్లోని ఓ పోలింగ్ స్టేషన్ లో ఉన్న 9 మంది ఓటర్ల కోసం పోలింగ్ సిబ్బంది పెద్ద పెద్ద మొసళ్లు ఉన్న బురద నేలలను దాటుకుని వెళ్లారు.
  • మూడో దశ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ సిబ్బంది ఒకే ఒక్క ఓటర్ కోసం గుజరాత్ లో సింహాలు సంచరించే అడవులు దాటి వెళ్లాల్సి ఉంది.
  • లడాఖ్ రీజియన్ లో పోలింగ్ సిబ్బందిని హెలికాప్టర్లలో తరలిస్తారు. ఆ తర్వాత వారు వీపున ఆక్సిజన్ సిలిండర్లు తగిలించుకుని ఒక రోజు ట్రెక్కింగ్ చేసి ఓటర్ల వద్దకు వెళ్లాలి.