నా సోదరుడు ప్రేమ పెళ్లి చేసుకున్నాడు:పూజాహెగ్డే

నా సోదరుడు ప్రేమ పెళ్లి చేసుకున్నాడు:పూజాహెగ్డే

స్టార్‌ హీరోయిన్‌ పూజాహెగ్డే ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి. ఆమె సోదరుడు (అన్నయ్య) రిషబ్ హెగ్డే వివాహం శివానీ శెట్టితో జరిగింది. అయితే వీరి పెళ్లికి సంబంధించిన అన్ని వ్యవహారాలను పూజానే దగ్గరుండి చూసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా తన ఆనందాన్ని పంచుకుంటూ పెళ్లి ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ‘నా సోదరుడు ప్రేమ పెళ్లి చేసుకున్నాడని పోస్ట్ లో తెలిపింది. ఈ వేడుక ప్రారంభం నుంచి తాను ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉన్నానని, చిన్నపిల్లలా నవ్వానని... దాంతో  ఆనందభాష్పాలు కూడా వచ్చాయని పేర్కొంది. రిషబ్ తన జీవితంలో మరో అధ్యాయంలోకి అడుగుపెడుతున్నాడన్న పూజా... పెళ్లి కూతురు శివానీని తన ఫ్యామీలీలోకి వెల్ కమ్ చెప్పింది. మీరు కూడా నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరుకుంటున్నాని తన ప్రేమను కురిపించింది. పెళ్లి ఫొటోల్లో పూజా హెగ్డే ఎర్రని పట్టుశారీలో ఎంతో అందంగా కనిపించి, మైమరపించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో సినీ తారలు, నెటిజన్లు, అభిమానులు సైతం కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.