వాల్తేరు వీరయ్య.. మరో మాస్ సాంగ్ వచ్చేస్తోంది

వాల్తేరు వీరయ్య.. మరో మాస్ సాంగ్ వచ్చేస్తోంది

మెగాస్టార్ చిరంజీవి నటించిన లెటెస్ట్ ఫిల్మ్ ‘వాల్తేరు వీరయ్య’ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించి రిలీజైన పోస్టర్, సాంగ్స్ అభిమానులను అలరించాయి. ఈ సినిమాకు సంబంధించి ఫిల్మ్ మేకర్స్ తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు. వాల్తేరు వీరయ్య నుంచి మరో మాస్ సాంగ్ వచ్చేస్తోందని ప్రకటించింది.

మెగాస్టార్ × మాస్ మహారాజా = పూనకాలు లోడింగ్ అంటూ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. ఫొటోలో చిరంజీవితో పాటు మాస్ మహారాజా రవితేజ కూడా ఉన్నాడు. ఈ మాస్ సాంగ్ ను శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ఎంపిక చేసిన థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. సంధ్యా 70 ఎంఎం (హైదరాబాద్), M1 సినిమాస్ ( నెల్లూరు), ఎస్వీ సినీ మాక్స్ (అనంతపురం), స్వామి (రాజమండ్రి), భాస్కర్ (గుంటూరు), జైరాం (విజయవాడ) థియేటర్లలలో రిలీజ్ చేయనున్నారు.

ఇప్పటికే బాస్ పార్టీ, వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్, శ్రీదేవి చిరంజీవి సాంగ్ లు అభిమానులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతానికి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ జనవరి 13న రిలీజ్ కాబోతోంది. చిరంజీవికి జంటగా శ్రుతిహాసన్‌‌‌‌ నటిస్తోంది. ఇందులో ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ చేసింది. ఈ మాస్‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌లో రవితేజ కీలకపాత్ర పోషిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మరోవైపు బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’, విజయ్ ‘వారసుడు’ చిత్రాలు జనవరి 12న రిలీజ్ కానున్నాయి.