ప్రభుత్వ స్థలంలో పేదల గుడిసెలు.. గత ప్రభుత్వం మోసం చేసిందంటూ ఆవేదన..

ప్రభుత్వ స్థలంలో పేదల గుడిసెలు.. గత ప్రభుత్వం మోసం చేసిందంటూ ఆవేదన..

హైదరాబాద్ లోని మియాపూర్ దీప్తిశ్రీ నగర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీప్తిశ్రీనగర్ సర్వే నంబర్ 100,101 లో ఉన్న ప్రభుత్వ స్థలం లో  పేదలు వందలాదిగా గుడిసెలు వేశారు. ఆ గుడిసెలు కాళీ చేయించేందుకు పోలీసులు వెళ్లటంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గుడిసెలు కాళీ చేసేందుకు నిరాకరించిన పేదలు గత ప్రభుత్వం తమకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని మోసం చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం స్పందించి తమకు అక్కడే ఇళ్ళు కట్టించాలని డిమాండ్ చేశారు.గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల స్కీం అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవటంతో నగర శివార్లలో చాలా చోట్ల పేదలు గుడిసెల్లోనే నివసిస్తున్నారు.మరి, ప్రస్తుత ప్రభుత్వం ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.