మధ్యతరగతి ప్రజలు తాము కష్టపడి సంపాదించిన డబ్బును సురక్షితమైన ప్రదేశంలో దాచుకోవడానికి, ఎటువంటి నష్టం లేని భరోసాతో కూడిన ఆదాయాన్ని పొందడానికి పోస్టాఫీస్ పొదుపు పథకాలను బెస్ట్ అని భావిస్తారు. ఈ స్కీమ్స్ పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వ హామీ ఉంటుంది కాబట్టి.. పెట్టుబడులకు 100 శాతం రక్షణ లభిస్తుంది. మార్కెట్ ఒడిదొడుకులతో సంబంధం లేకుండా రిస్క్ లేని పెట్టుబడి ద్వారా తమ డబ్బును పోస్టాఫీస్ అందించే టైమ్ డిపాజిట్ స్కీమ్ బెస్ట్.
ప్రస్తుతం అనేక ప్రభుత్వ బ్యాంకులు అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్ల కంటే లభించే వడ్డీ రేట్లు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇందులో పెట్టుబడిదారులకు గరిష్ట వడ్డీతో పాటు పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. కేంద్ర ప్రభుత్వం వివిధ కాలపరిమితులకు వేర్వేరు వడ్డీ రేట్లను నిర్ణయించింది. దీని ప్రకారం ఒక సంవత్సర కాలపరిమితికి 6.9 శాతం, రెండేళ్లకు 7 శాతం, మూడేళ్ల కాలపరిమితికి 7 శాతం వడ్డీ లభిస్తుంది. అయితే అన్నింటికంటే ఎక్కువగా 5 ఏళ్ల కాలానికి టైమ్ డిపాజిట్ పథకానికి ఏకంగా సంవత్సరానికి 7.5 శాతం చొప్పున అత్యధిక వడ్డీ రేటును అందిస్తున్నారు.
►ALSO READ | పెట్రోల్ బైక్ vs ఎలక్ట్రిక్ బైక్: ఏది బెస్ట్..? బైక్ కొనేముందు లాభనష్టాలు తెలుసుకోండి...
కేవలం 2 లక్షల రూపాయల చిన్న మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి దాదాపు 90వేల రూపాయల వరకు వడ్డీని సంపాదించవచ్చు. ఒక వ్యక్తి ఈ స్కీమ్‌లో రూ.2లక్షల మొత్తాన్ని 5 ఏళ్ల పాటు ఫిక్స్ చేస్తే.. 7.5 శాతం వార్షిక వడ్డీ రేటుతో గడువు ముగిసేసరికి అసలుతో పాటు వడ్డీ కలిపి సుమారుగా రూ.2లక్షల 89వేల 990 చేతికి అందుతాయి. అంటే ఇందులో ఎటువంటి రిస్క్ లేకుండా కేవలం వడ్డీ రూపంలోనే సుమారు రూ.90వేలు లాభం లభిస్తుంది. సామాన్య ప్రజలు సైతం ధైర్యంగా పెట్టుబడి పెట్టడానికి ఇదొక సువర్ణావకాశం.
సాధారణ సామాన్యులు కూడా ఈ పథకంలో సులభంగా చేరేలా పోస్టాఫీస్ ఏర్పాటు చేసింది. కేవలం రూ.1,000 కనీస మొత్తంతో ఈ టైమ్ డిపాజిట్ ఖాతాను ప్రారంభించవచ్చు. ఇందులో గరిష్ట పెట్టుబడికి ఎటువంటి పరిమితి లేదు. మీ ఆర్థిక శక్తిని బట్టి ఎంత ఎక్కువ పెట్టుబడి పెడితే అంత ఎక్కువ వడ్డీ రాబడిని సొంతం చేసుకోవచ్చు. ఈ స్కీమ్ కింద వ్యక్తిగత ఖాతాతో పాటు ముగ్గురు కలిసి జాయింట్ అకౌంట్ కూడా తెరవవచ్చు. అంతేకాకుండా 10 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లల పేరు మీద కూడా ఈ ఖాతాలను సులభంగా ఓపెన్ చేసే సదుపాయం ఉంది. ఇందులో వడ్డీని ప్రతి సంవత్సరం చక్రవడ్డీ పద్ధతిలో లెక్కిస్తారు.
