
కర్నూలు: శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఏపీ ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారు. జలాశయంలో నీటి లభ్యత తక్కువగా ఉండడంతో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఉత్పత్తి నిలిపివేసినట్లు ఇన్చార్జ్ చీఫ్ ఇంజనీర్ రాంబాబు తెలిపారు. శ్రీశైలం జలాశయంలో ప్రస్తుత నీటి మట్టం 812 అడుగులకు చేరిందని, రిజర్వాయర్‌లో 32.8 టీఎంసీలకు పడిపోయిందని రాంబాబు పేర్కొన్నారు. కృష్ణా రివర్ బోర్డు ఏపీకి కేటాయించిన నీటి వాటాల ప్రకారం జలాశయంలోని నీటిని వినియోగించుకున్నట్లు ఆయన వివరించారు.