క్వారంటైన్‌లోకి పవర్‌స్టార్ పవన్ కల్యాణ్

క్వారంటైన్‌లోకి పవర్‌స్టార్ పవన్ కల్యాణ్

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఆయన వ్యక్తిగత, భద్రతా సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. గత వారం నుంచి ఆయన సిబ్బంది ఒక్కొక్కరుగా కరోనా బారినపడుతున్నారు. వారంతా ఆయనకు చాలా సమీపంగా విధులు నిర్వర్తిస్తున్నారు. దాంతో ముందు జాగ్రత్త చర్యగానే క్వారంటైన్‌లోకి వెళ్లినట్లు పవన్ తెలిపారు. క్వారంటైన్‌లోకి వెళ్లడంతో తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలో ఆయన పాల్గొనలేరు కాబట్టి జనసేన పార్టీ నేతలతో టెలీకాన్పరెన్స్ ద్వారా మాట్లాడుతున్నారు.