ప్రభాస్ స్టైలిష్ లుక్ కి ఫ్యాన్స్ ఫిదా

ప్రభాస్ స్టైలిష్ లుక్ కి ఫ్యాన్స్ ఫిదా

వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఓవైపు ‘సాలార్‌‌‌‌‌‌‌‌’.. మరోవైపు ‘ప్రాజెక్ట్‌‌‌‌ కె’ షూటింగ్స్‌‌‌‌ జరుగుతున్నాయి. రెండు భారీ చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ మరో కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి ఆశ్చర్యపరిచాడు ప్రభాస్. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించి అనౌన్స్‌‌‌‌మెంట్ రాలేదు కానీ.. షూట్ మాత్రం చకచకా జరిగిపోతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌‌‌‌లో షూటింగ్‌‌‌‌ జరుగుతోంది. ఇందుకు సంబంధించిన వర్కింగ్ స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. 

సెట్‌‌‌‌లో ప్రభాస్‌‌‌‌, దర్శకుడు మారుతి ఏదో సీన్ గురించి మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తున్నారు. కీలక సన్నివేశాలు తీస్తున్నట్టు అర్థమవుతోంది. ఫొటోలోని ప్రభాస్‌‌‌‌ స్టైలిష్‌‌‌‌ లుక్‌‌‌‌కు ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటో వైరల్ అవుతోంది. సూపర్ నేచురల్ హారర్ కాన్సెప్ట్‌‌‌‌తో, ఓ థియేటర్‌‌‌‌‌‌‌‌ చుట్టూ తిరిగే తాతామనవడి కథతో రూపొందిస్తోన్న ఈ మూవీకి ‘రాజాడీలక్స్‌‌‌‌’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధీ కుమార్ హీరోయిన్స్. ప్రభాస్‌‌‌‌కు తాతగా సంజయ్‌‌‌‌దత్ కీలకపాత్ర పోషిస్తున్నట్టు టాక్. వీళ్లిద్దరి మధ్య ఎమోషన్‌‌‌‌ సినిమాకు హైలైట్ అవుతుందంటున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, యూవీ క్రియేషన్స్‌‌‌‌ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు.