పెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ లవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‘రాధే శ్యామ్’

పెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ లవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‘రాధే శ్యామ్’

ప్రేమలో ఆనందం ఉంటుంది. బాధ కూడా ఉంటుంది. చేయి చేయి కలిసి నడుస్తున్నప్పుడు మనసు ఎంత మురిసిపోతుందో.. దారులు వేరై దూరమవుతున్నప్పుడు హృదయం అంత రగిలిపోతుంది. ఇదే బాధను అనుభవిస్తున్నారు ప్రభాస్, పూజా హెగ్డే. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ప్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా ఫిల్మ్ ‘రాధేశ్యామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ హిందీ వెర్షన్ నుంచి నిన్న ‘సోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లియా’ అనే పాట విడుదలైంది. ఇద్దరు ప్రేమికుల మధ్య ఎడబాటు కలిగించిన ఆవేదనను కళ్లకు కట్టింది. రాధాకృష్ణకుమార్ తెరకెక్కి స్తున్న ఈ చిత్రంలో విక్రమాదిత్యగా ప్రభాస్, ప్రేరణగా పూజ నటిస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం రిలీజ్ చేసిన ఓ పాటలో క్యూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రొమాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ కనిపించిన ఈ జంట.. నిన్న రిలీజైన పాటలో మాత్రం కళ్ల నిండా నీళ్లతో కనిపించారు.

తాము సంతోషంగా గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ తమలో తామే మథనపడుతున్నారు. మిథున్ ట్యూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు అర్జీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్ వాయిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా లవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని పెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ప్రేక్షకుడు ఫీలయ్యేలా చేస్తున్నాయి. ఈ చిత్రానికి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక సినిమాకి రెండు భాషల్లో వేర్వేరు సంగీత దర్శకులు పని చేయడం ఇదే తొలిసారి. గోపీకృష్ణా బ్యానర్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. జనవరి 14న సినిమా విడుదల కానుంది.