కొత్త స్మార్ట్ ఫొన్ HMD Vibe 2 Pro 5G లో సర్వమ్ ఏఐ (Sarvam AI) కి చెందిన ఇండస్ ఏఐ అసిస్టెంట్‌ను ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.బడ్జెట్ ధరలోనే భారతీయ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఈ ఏఐ ఫీచర్‌ను డిజైన్ చేశారు.ఈ ఏఐ అసిస్టెంట్ తెలుగుతో పాటు 22 కంటే ఎక్కువ భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది. కస్టమర్లు తమ సొంత ప్రాంతీయ భాషల్లోనే దీనితో మాట్లాడొచ్చు.
హెచ్‌ఎండీ వైబ్ 2 ప్రోలో సర్వం ఏఐ ఫీచర్
హెచ్‌ఎమ్‌డీ వైబ్ 2 ప్రో 5జీ భారత్‌లో విడుదలైంది. 6.78 అంగుళాల 120హెడ్జ్ ఎఫ్‌హెచ్‌డీ+ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ను ఇందులో అమర్చారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16పై పనిచేస్తుంది. ఇందులో 64ఎంపీ సోనీ మెయిన్ కెమెరా, 13ఎంపీ సెల్ఫీ కెమెరా, 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన భారీ 6,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. సర్వమ్ ‘ఇండస్ ఏఐ’ ఫీచర్‌ను అందించారు. ఈ ఫీచర్ 22 భారతీయ భాషల్లో సేవలందిస్తుంది. 6జీబీ+128 జీబీ వేరియంట్ ధర రూ.16 వేలు. 8జీబీ+128జీబీ ధర రూ.18 వేలు. ఆఫర్‌లో భాగంగా కస్టమర్లు ఈ ఫోన్లను వరుసగా రూ.15 వేలు, రూ.17 వేలకు పొందొచ్చు.
