శ్రీవిష్ణు, మహిమా నంబియార్ జంటగా జానకిరామ్ మారెళ్ల రూపొందించిన చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. కోన వెంకట్ సమర్పణలో వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మించారు. మంగళవారం ఈ చిత్రం నుంచి ‘ఎత్తర ఎత్తు’ అంటూ సాగే పాటను దర్శకుడు అనిల్ రావిపూడి రిలీజ్ చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు.
విజయ్ బుల్గానిన్ కంపోజ్ చేయగా.. నల్గొండ గద్దర్ నర్సన్న తన ప్రత్యేకమైన వాయిస్‌తో పవర్‌ఫుల్ ఎనర్జీని అందించారు, భాస్కరభట్ల రాసిన లిరిక్స్ పాటకు రివల్యూషనరీ ఫీల్‌ను తీసుకొచ్చాయి. ‘అరె దొరగారి చెప్పు కింద ఎన్నాళ్ళీ నలుగుడంటా.. మోచేతి నీళ్లతోటి ఏ దప్పిక తీరదంటా.. బుసకొట్టిన పాము మీద చీమలు దండెత్తెనంటా.. రాజుకుంటే అగ్గిరవ్వ అడివంతా బూడిదంటా.. మనదేమో మురికివాడ ఆడిది అద్దాలమేడ.. మన నెత్తురు తాగినాది ఆడింటి ఇటుక బెడ్డ..ఛల్... ఏహే.. ఎత్తర ఎత్తు.. పిడికిలి ఎత్తు.. ఎత్తర ఎత్తు గునపం ఎత్తు...’ అంటూ సాగిన పాటలో శ్రీవిష్ణు పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు.
ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. శ్రీవిష్ణు కామెడీ టైమింగ్, అల్లరి మేనరిజమ్స్ వేరే లెవల్లో ఉండనుంది. హీరోయిన్ మహిమా నంబియార్ తన అందంతో ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది.. కళ్యాణ్ (శ్రీవిష్ణు)తల్లిగా సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ తనదైన నటనతో అలరిస్తున్నారు.
మోస్ట్ వాంటెడ్ నక్సలైట్‌ను పట్టుకోవడానికి పరిగెత్తే పోలీస్ ఆఫీసర్‌గా షైన్ టామ్ చాకో నెగెటివ్ అండ్ ఫన్నీ షేడ్స్‌లో కనిపించనున్నాడు. ఇక వెన్నెల కిషోర్, సత్యతో పాటు ఉపేంద్ర లిమాయే ప్రముఖ హాస్య నటులు రంగంలోకి దిగడంతో అక్టోబర్ 2న వినోదం రెట్టింపు కానుంది. అక్టోబర్ 9న సినిమా విడుదల కానుంది.
