రజినీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం ‘ధర్మన్’. అశ్వత్ మారుముత్తు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సిమ్రాన్, రాశీఖన్నా కీలకపాత్రలు పోషిస్తున్నారు. టాలీవుడ్ హీరో రామ్ ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్టు గత కొద్దిరోజులుగా ప్రచారంలో ఉంది. మేకర్స్ మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. కానీ రాశీఖన్నా ఈ విషయాన్ని చాలా క్యాజువల్‌గా రివీల్ చేసేసింది.
ప్రస్తుతం మైసూర్‌లో షూటింగ్ జరుగుతుండగా.. రజినీకాంత్, రామ్‌తో కలిసి దిగిన ఫొటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇద్దరు స్టార్స్‌తో ఎర్లీ మార్నింగ్ వర్కవుట్స్ అంటూ ఈ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది. రామ్ క్యారెక్టర్ గురించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదన్న విషయం ఆలస్యంగా గ్రహించిన రాశీ.. ఆ తర్వాత ఫొటోను డిలీట్ చేసింది. కానీ అప్పటికే ఫొటో వైరల్ అయింది. దీంతో ఈ చిత్రంలో రామ్ నటిస్తున్న విషయం కన్ఫర్మ్ అయింది.
Rajini, Raashi Khanna, Ram at Mysore for #Dharman shoot 👌🔥 Film by @Dir_Ashwath 🎥 pic.twitter.com/v5M7w1iEPq
— Filmy South (@filmy_south_) September 29, 2026
అవినీతిపై పోరాటం చేసే డాక్టర్ ధర్మన్‌గా రజినీకాంత్ ఇందులో నటిస్తున్నారు. ఆయన కూతురుగా రాశీఖన్నా, తన భర్తగా రామ్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
