
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘ప్రాజెక్ట్ కె’. అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొణె కీలకపాత్రలు పోషిస్తున్న ఈ మూవీని అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్, షూటింగ్‌కు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు స్పెషల్ వీడియోస్ ద్వారా షేర్ చేస్తున్నారు మేకర్స్. ఎలాంటి రిఫరెన్స్‌లు లేని కొత్త తరహా కాన్సెప్ట్ మూవీ కావడంతో.. ప్రతీది తయారు చేస్తున్నారు. మూడు నెలల క్రితం ‘ఫ్రమ్ స్క్రాచ్’ పేరుతో టైర్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసిన మేకర్స్. ఈసారి కాస్ట్యూమ్స్‌ని డిజైన్ చేస్తున్న వీడియోని షేర్ చేశారు.
సినిమాలో విలన్ గ్యాంగ్ పేరు ‘రైడర్స్’. వాళ్ల కోసం స్పెషల్ కాస్ట్యూమ్స్‌ని డిజైన్ చేస్తున్న విజువల్స్‌ని ఈ వీడియోలో చూపించారు. హాలీవుడ్ సినిమాల కోసం ఈ తరహా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతుంటాయి. ఈ సినిమాను కూడా అదే స్థాయిలో రూపొందిస్తున్నట్టు అర్థమవుతోంది. ఈ రైడర్స్ ఎలా ఉండబోతున్నారు.. సినిమాలో వీళ్ల ఇంపార్టెన్స్ ఏమిటి, వీళ్లతో ప్రభాస్ చేసే ఫైట్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది సినిమాలోనే చూడాలి. ఇదొక సైన్స్ ఫిక్షన్ మూవీ అని చెబుతున్నప్పటికీ, శ్రీ కృష్ణుడికి సంబంధించిన పాయింట్‌తో ఈ స్టోరీ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12న సినిమా విడుదల కానుంది.