పిక్చరైజేషన్ అదుర్స్… ‘సాహో’ లవ్ సాంగ్ రిలీజ్

పిక్చరైజేషన్ అదుర్స్… ‘సాహో’ లవ్ సాంగ్ రిలీజ్

ప్రభాస్ హీరోగా నటించిన సూపర్ యాక్షన్ ఫిలిం ‘సాహో’లోని ప్రేమ పాట విడుదలైంది. లవ్ ఆంథెమ్ ను ఎక్స్ పీరియన్స్ చేయండి అంటూ మూవీ టీమ్ ఈ వీడియో సోషల్ ప్లాట్ ఫామ్స్ లో రిలీజ్ చేసింది.

పంజాబీ పాప్ సింగర్, బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ గురు రాంధావా ఈ పాటకు సంగీతం అందించాడు. హరిచరణ్ ఎస్, తుల్సీ కుమార్ ఈ పాటను పాడారు. రైటర్ కృష్ణకాంత్ ఈ పాటను రాశారు. హిందీలో ఈ పాటను గురు రాంధావా పాడాడు.

ఆస్ట్రియాలోని ఎత్తైన కొండలు, లోయలు.. లొకేషన్లలో ఈ పాటను చిత్రీకరించారు. పాట చిత్రీకరణ అద్భుతంగా ఉందంటున్నారు ప్రభాస్ అభిమానులు.

ఆగస్ట్ 30న సాహో విడుదల కానుండటంతో… ఈ నెలలో మూవీ ట్రైలర్, సాంగ్స్ రిలీజ్, ప్రి రిలీజ్ ఈవెంట్ లు ఉంటాయని.. ఈ నెలంతా పండగే అని అభిమానులు సంబరపడిపోతున్నారు.

హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సాహో విడుదల కానుంది. మూవీకి సుజీత్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది.