విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాన్ తో మహిళలకు చేయూత.. ‘ప్రజ్వల’ ఫౌండర్ సునితా కృష్ణన్

విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాన్ తో  మహిళలకు చేయూత.. ‘ప్రజ్వల’ ఫౌండర్ సునితా కృష్ణన్

పంజాగుట్ట, వెలుగు: విక్టిమ్​ప్రొటెక్షన్​ప్లాన్​అక్రమ రవాణాకు గురైన మహిళలకు చేయూతనిస్తుందని ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ఫౌండర్​సునితా కృష్ణన్ అన్నారు. గురువారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అక్రమ రవాణాకు గురైన పలువురు బాధితులతో కలిసి ఆమె మాట్లాడారు. విమెన్​ట్రాఫికింగ్​కు పాల్పడి, వారితో అసాంఘిక కార్యాకలాపాలు చేయించడం బాధాకరమన్నారు. బాధితులకు తక్షణ పరిహారం అందడం వల్ల వారు ఆర్థికంగా నిలదొక్కుకొని సమాజంలో గౌరవంగా జీవిస్తారని పేర్కొన్నారు. లోక్​సభలో ఆమోదం పొందిన విక్టిమ్​ప్రొటెక్షన్ ప్లాన్​త్వరలోనే బిల్లుగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.