- వాజ్ పేయి స్కీం వాళ్లు రద్దు చేసిండ్రు
- ఈ ఏడేళ్లలో 2,500 కి.మీ నిర్మించాం
- తెలంగాణలో లక్షా 9 వేల కోట్లు ఖర్చుచేశాం
- కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్
హుస్నాబాద్: కాంగ్రెస్ హయాంలో జాతీయ రహదారులు అభివృద్ధి చెందలేదని, రోడ్ కమ్, కరెప్షన్ జాదా అన్నట్టుగా వాళ్ల పాలన సాగిందని కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఇవాళ హుస్నాబాద్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ 9 సంవత్సరాల్లో 2,500 కిలోమీటర్ల జాతీయ రహదారిని విస్తరించామని, తెలంగాణలో లక్షా 9 వేల కోట్ల రూపాయలను రోడ్ల అభివృద్ధికి మోడీ సర్కారు ఖర్చు చేసిందని చెప్పారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందన్నారు. . మోడీకి 140 మంది భారతీయులే కుటుంబమని, వారి అభ్యున్నతి గురించే నిత్యం ఆలోచిస్తుంటారని తెలిపారు.
మహాజన్ సంపర్క్ యోజన కార్యక్రమంలో భాగంగా ప్రతి కార్యకర్త మూడిళ్లకు వెళ్లాలని.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పంట పెట్టుబడి, ఉజ్వల యోజన, మరుగుదొడ్ల నిర్మాణం, ఆవాస్ యోజన తదితర పథకాలపై అవగాహన కల్పించాలని, లబ్ధిదారుల వీడియోలను తీసి 89198 47687 వాట్సాప్ నంబర్ కు పంపాలని సూచించారు. ఇది తెలంగాణ బీజేపీకి సంబంధించిన నంబర్ అన్నారు. ఆ వెంటనే 9090902024 నంబర్ మిస్డ్ కాల్ ఇప్పంచాలని.. ఆ వెంటనే వారికి థాంక్యూ ఫర్ సపోర్టింగ్ మోడీజీ అని మెస్సేజ్ వస్తుందన్నారు. ఇలా చేయడం వల్ల ఇప్పుడు నాలుగు లోక్ సభ సీట్ల స్థానంలో 14 తప్పక వస్తాయని జవడేకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. జవడేకర్ వెంట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, రాష్ట్ర నాయకుడు ఎన్వీవీఎస్ ప్రభాకర్ తదితరులున్నారు.
