నిజమైన ప్రశాంత్ కిశోర్ జోస్యం.. ప్రస్తుతం వైరల్‌‌‌‌గా మారిన పాత వీడియో

 నిజమైన ప్రశాంత్ కిశోర్ జోస్యం.. ప్రస్తుతం వైరల్‌‌‌‌గా మారిన పాత వీడియో

న్యూఢిల్లీ: తమిళనాడులో ఎవరూ ఊహించని విధంగా విజయ్ పార్టీ టీవీకే అద్భుతమైన ఫలి తాలు నమోదు చేసింది. సరిగ్గా ఏడాది క్రితం మార్చి 2025లో ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజమయ్యాయి. విజయ్ ఒంటరిగా పోటీ చేయా లనే పట్టుదలతో ఉన్నారని, ఆ నిర్ణయానికి ఆయ న కట్టుబడి ఉంటే తమిళనాడులో గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని కిషోర్ అప్పట్లోనే చెప్పారు.

 విజయ్ పార్టీకి మేజిక్ ఫిగర్ (118 సీట్లు) వస్తుందా..? అని యాంకర్ ప్రశ్నించగా.. "కచ్చితంగా వస్తుంది. ఈ వీడియోను రికార్డ్ చేసి దాచి పెట్టుకోండి, ఫలితాలు వచ్చిన రోజు ప్లే చేయండి" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విజయ్ రాజకీయ సలహాదారుగా వ్యవహరిస్తున్నారా..? అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ తమ మధ్య ఉన్నది స్నేహం మాత్రమేనని, ఐదేండ్లుగా మాట్లాడుకుంటున్నామని, అయితే తాను అధికారికంగా అడ్వైజర్‌‌‌‌ను కాదని కిశోర్ స్పష్టం చేశారు. ప్రశాంత్ కిశోర్ చెప్పినట్లే ఆ వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్​అవుతోంది.