క్రికెటర్ పృథ్వీ షాపై దాడి కేసులో నటి అరెస్ట్

క్రికెటర్ పృథ్వీ షాపై దాడి కేసులో నటి అరెస్ట్

టీమిండియా క్రికెటర్  పృథ్వీ షాపై దాడి చేసిన యాక్టర్ స్వప్నా గిల్ ను ముంబై పోలీసులు అరెస్ట్  చేశారు. 2.20లక్షల ఫాలోవ్ర్స్ ఉన్న ఆమె ముంబైలో ఉంటూ పలు భోజ్ పురీ సినిమాల్లో రవికిషన్ సహా పలువురితో కలిసి నటించింది.

బుధవారం సాయంత్రం పృథ్వీ షా అతని స్నేహితుడు ఆశిష్ సురేంద్రతో కలిసి శాంతాక్రూజ్‌లోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌కు డిన్నర్ కు వెళ్లాడు. అదే సమయంలో కొందరు సెల్ఫీ కోసం పృథ్వీ షా  వద్దకు వచ్చారు. అభిమానుల మాటను కాదనలేకపోయిన షా వారిలో ఇద్దరితో సెల్ఫీలు దిగాడు. అయితే, వెంటనే మరికొందరు వచ్చి సెల్ఫీ అడగటం, అందుకు అతడు అంగీకరించకపోవడంతో గొడవ మొదలైంది. ఈ లోపు పక్కనే ఉన్న పృథ్వీషా స్నేహితుడు హోటల్‌ సిబ్బందికి జరుగుతున్న విషయాన్ని వివరించగా.. సిబ్బంది నిందితులను హోటల్‌ బయటకు గెంటేశారు.  దీన్ని అవమానంగా భావించిన నిందితులు పార్కింగ్ ప్లేస్ కు వచ్చి..  షా ప్రయాణిస్తున్న​ బీఎండబ్ల్యూ కారుపై బేస్‌బాల్‌ బ్యాట్లతో దాడికి దిగారు. ఎలాగోలా తప్పించుకున్న షా నేరుగా పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.