V6 News

పాత లెక్కలతో డీలిమిటేషన్ కు ఒప్పుకోం.. లోక్‌‌సభలో ప్రియాంకా గాంధీ వెల్లడి

పాత లెక్కలతో డీలిమిటేషన్ కు ఒప్పుకోం.. లోక్‌‌సభలో ప్రియాంకా గాంధీ వెల్లడి

న్యూఢిల్లీ: మహిళా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని కాంగ్రెస్‌‌ ఎంపీ ప్రియాంకా గాంధీ లోక్‌‌సభలో స్పష్టం చేశారు. అయితే, 2011 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్‌‌ చేయాలనుకుంటున్న కేంద్ర వైఖరికి మాత్రం తాము తీవ్ర వ్యతిరేకమని చెప్పారు. మహిళా రిజర్వేషన్‌‌ బిల్లును డీలిమిటేషన్‌‌తో ముడిపెట్టి ఆలస్యం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. 

ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు సబ్‌‌కోటా కల్పించి, బిల్లును వెంటనే అమలు చేయాలని డిమాండ్‌‌ చేశారు. ‘‘జనాభా కొత్త లెక్కల్లో బీసీల సంఖ్య భారీగా పెరిగే చాన్స్‌‌ ఉంటుంది. పాత లెక్కల ప్రకారం డీలిమిటేషన్‌‌ చేస్తే ఎంతోమంది బీసీలు వాళ్ల హక్కులు కోల్పోతారు” అని ప్రియాంక గాంధీ చెప్పారు.