V6 News

చెలరేగిన మణిందర్ సింగ్..బెంగాల్ విన్

చెలరేగిన మణిందర్ సింగ్..బెంగాల్ విన్
  • బెంగాల్‌‌ భారీ విజయం చెలరేగిన మణిందర్‌ సింగ్‌
  • 23–43తో పుణెరి చిత్తు

ముంబై: ప్రొ కబడ్డీ లీగ్‌ లో బెంగాల్‌ వారియర్స్‌ మరో  భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. తొలి మ్యాచ్‌ లో యూపీ యోధాను చిత్తు చేసి రెండో
మ్యాచ్‌ లో జైపూర్‌‌ చేతిలో పోరాడి ఓడిన వారియర్స్‌ వెంటనే పుంజుకుంది. మణిందర్‌‌ సింగ్‌ 14 పాయింట్లతో చెలరేగడంతో సోమవారం జరిగిన లీగ్‌
మ్యాచ్‌ లో 43–23తో పుణెరి పల్టన్‌ పై గ్రాండ్‌‌ విక్టరీ కొట్టింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌ లో ఏకంగా 22 రైడ్‌‌ పాయింట్లు సాధించిన బెంగాల్‌ .. 12
టాకిల్‌ పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ప్రత్యర్థిని మూడు సార్లు ఆలౌట్‌ చేసింది. స్టార్‌‌ రైడర్‌‌ మణిందర్‌‌తో పాటు మహమ్మద్‌ నొబిబక్ష్‌ (8), రింకూ
నర్వాల్‌ (5) కూడా సత్తా చాటారు. 13 రైడ్‌‌, 9 టాకిల్‌ పాయింట్లకే పరిమితమైన పుణెరి.. ప్రత్యర్థికి ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ఫస్టాఫ్‌ లోనే 9–18తో వెనకబడింది. ఓ దశలో బెంగాల్‌ 33-11తో నిలిచినా.. చివర్లో కాస్త పోరాడిన పుణెరి 20 పాయింట్ల మార్కు దాటింది.
పట్నా ఉత్కంఠ గెలుపు
13 సార్లు రైడ్‌‌కు వెళ్లి ఒకే పాయిం ట్‌ తెచ్చిన పర్‌‌దీప్‌ నర్వాల్‌ విఫలమైనా జైదీప్‌ (7), మోను (5) సత్తా చాటడంతో పట్నా పైరేట్స్‌ 24–23తో తమిళ్‌ తలైవాస్‌ పై ఉత్కం ఠ విజయం సాధించింది. చివరి నిమిషం వరకూ నువ్వానేనా అన్నట్టు సాగిన ఈ మ్యాచ్‌ లో రాహుల్‌ చౌదరి (5), మన్‌ జీత్‌ చిల్లార్‌‌ (4) రాణించి నా.. తలైవాస్‌ ను గెలిపించలేకపోయారు.