IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటనే వ్యాపారం, క్రికెట్ ఎక్కడిది అని సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఫ్యాన్స్ ని ఎంటర్‌టైన్ చేయాడానికే ఈ టోర్నమెంట్ రూపొందించారని తేల్చి చెప్పాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా బుధవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 244 పరుగుల భారీ టార్గెట్ ని హైదరాబాద్ మరో 6 వికెట్లు ఉండగానే ఛేదించింది.
కాగా ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 30 సార్లుకు పైగా 200+ స్కోర్లు నమోదు అయ్యాయి. 264, 244 రన్స్ వంటి భారీ లక్ష్యాలు కూడా ఈజీగా ఛేదించేశారు. దాంతో ఈ సీజన్ బౌలర్లకు ఓ పీడకలగా మారిపోయిందనే అంశం సోషల్ మీడియాలో వ్యక్తం అవుతుంది. ఇక ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ గెలిచిన తర్వాత మీడియా సమావేశంలో పాల్గొన్న ముత్తయ్య మురళీధరన్‌ను బౌలర్ల కష్టాల గురించి ఓ ప్రశ్న ఎదురైంది. ఆరెంజ్ ఆర్మీ బౌలింగ్ ఆన్సర్ ఇస్తూ.. ఈ సీజన్‌లో జట్లు నిరంతరం 200+ స్కోర్లు నమోదు చేయడానికి గల కారణాలను వివరించాడు. పవర్ ప్లేలో దూకుడుగా ఆడటంతో భారీ స్కోర్లు నమోదుకి ఓ ప్రధాన కారణమని వెల్లడించాడు.
బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌లతోనే భారీ స్కోర్లు వస్తున్నాయి.. టాపార్డర్ బ్యాటర్లు వేగంగా రన్స్ చేస్తున్నారు.. దీంతో బౌలర్లకు వికెట్ల నుంచి సహకారం లభించకపోవడంతో పాటు బౌండరీల సైజ్ కూడా చిన్నగా ఉండటం వలన బౌలర్లకు కష్టంగా మారిపోయింది. బౌలింగ్‌కు అనుకూలించే వికెట్లు తయారు చేస్తే.. ప్రేక్షకులకి బోర్ కొడుతుందని.. ఐపీఎల్ స్ట్రక్చర్ ని పూర్తిగా మార్చేశారు. ఈ విషయంలో బౌలర్లను తప్పు పట్టాల్సిన అవసరం లేదని ముత్తయ్య మురళీధరన్ వెల్లడించాడు.
2020 నుంచి మ్యాచ్‌లు చూసేవారు ఆట కంటే ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఎక్కువగా కోరుకుంటున్నారు.. అందుకే ఫోర్లు, సిక్స్‌లు చూడాలని కోరుకునే వారి కోసమే ఐపీఎల్‌లో చాలా మార్పులు చేశారని ముత్తయ్య మురళీధరన్ పేర్కొన్నారు. ఇంపాక్ట్ రూల్‌తో అదనంగా బ్యాటర్ రావడంతో స్కోర్ బోర్డుపై కనీసం 200+ మార్క్ కనపడుతుంది. ఈ మెగా టోర్నమెంట్ ఆవిర్భావం వెనక చాలా అంశాలు ఉన్నాయి.. క్రికెట్‌ను అభివృద్ధి చేస్తున్నారా? లేదా అనేది ఇక్కడ విషయమే కాదు.. క్రికెటర్లకు ఛాన్స్ లు లభిస్తున్నాయి.. ఫ్యాన్స్ కి ఎంటర్‌టైన్‌మెంట్ లభిస్తుంది.. ప్రస్తుతం ఐపీఎల్ టోర్నీ పెద్ద వ్యాపారం.. ఇక్కడ స్పాన్సర్లు చాలా కీలకం.. ఆటపై విసుగు వస్తే, ఈ లీగ్‌కు ప్రజాదరణ తగ్గిపోతుంది.. దీంతో స్పాన్సర్లు వ్యూయర్స్‌ను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హైదరాబాద్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య చెప్పుకొచ్చాడు.

