టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఒక పవర్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామాతో ఆయన ‘బైకర్’ (Biker) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదలైంది. భారతదేశంలోనే మొట్టమొదటి మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యంతో తెరకెక్కి రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఈ హై-వోల్టేజ్ యాక్షన్ మూవీ డిజిటల్ దునియాలో సందడి చేసేందుకు సిద్ధమైంది.
నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు దక్కించుకుంది. థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోనే, అంటే మే 1, 2026 నుండి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఇది అందుబాటులోకి రానుంది. ఇక హిందీ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఈ సినిమాను ‘శర్వా’ (Sharwa) అనే ఆసక్తికరమైన టైటిల్‌తో విడుదల చేస్తున్నారు.
కథా నేపథ్యం..
అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కేవలం బైక్ రేసింగ్ చుట్టూ మాత్రమే కాకుండా, బలమైన ఎమోషన్స్ చుట్టూ తిరుగుతుంది. వికాస్ నారాయణ్ (శర్వానంద్) ఒక ప్రొఫెషనల్ బైక్ రేసర్. తన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో తండ్రి సునీల్ నారాయణ్ (రాజశేఖర్) తో ఎదురయ్యే సంఘర్షణలు, పట్టుదల ఈ సినిమాకు ప్రధానంగా నిలిచాయి. ఈ పాత్ర కోసం శర్వానంద్ ప్రత్యేకంగా మోటోక్రాస్ రేసింగ్‌లో శిక్షణ పొందారు. ఆయన బాడీ లాంగ్వేజ్, రేసింగ్ సీక్వెన్స్‌లలో చూపిన ఈజ్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయి. చాలా కాలం తర్వాత సీనియర్ హీరో రాజశేఖర్ ఒక కీలక పాత్రలో నటించి సినిమాకు ప్రాణం పోశారు. తండ్రీకొడుకుల మధ్య సాగే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.
థియేటర్లలో మిశ్రమ స్పందన..
యువి క్రియేషన్స్ (UV Creations) నిర్మాణ విలువలు ఈ సినిమాను విజువల్ వండర్‌గా తీర్చిదిద్దాయి. ఘిబ్రాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రేసింగ్ సీక్వెన్స్‌లను వేరే లెవల్‌కు తీసుకెళ్లాయి. మాళవిక నాయర్ కథానాయికగా మెప్పించగా, అతుల్ కులకర్ణి, బ్రహ్మాజీ, శశాంక్ తమ పాత్రలకు న్యాయం చేశారు. థియేటర్లలో మిశ్రమ స్పందన లభించినప్పటికీ, టెక్నికల్ వాల్యూస్ , రేసింగ్ ఫీల్ కోసం ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వేగంతో పోటీ పడే వికాస్ కథను మీ ఇంట్లోనే కూర్చుని ఆస్వాదించడానికి నెట్‌ఫ్లిక్స్ సిద్ధంగా ఉంది.
Gelavadam goppa kaadhu, chivaari dhaka poradatam goppa 🔥🏁 pic.twitter.com/ZNfp0WrKdD
— Netflix India South (@Netflix_INSouth) April 29, 2026

