V6 News

Riyan Parag: రియాన్ పరాగ్కి బిగ్ షాక్.. ఈ- సిగరెట్ తాగినందుకు రూ. 25 లక్షల ఫైన్

Riyan Parag: రియాన్ పరాగ్కి బిగ్ షాక్.. ఈ- సిగరెట్ తాగినందుకు రూ. 25 లక్షల ఫైన్

Riyan Parag: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్‌లో ఈ-–సిగరెట్ తాగుతూ కెమెరా కంట్లో పడిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్‌పై బీసీసీఐ చర్యలు చేపట్టింది. అతడి మ్యాచ్‌ ఫీజులో 25శాతం ఫైన్ విధించింది. అంతేకాకుండా అతడి ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ ని కూడా జోడించింది. 

భారత క్రికెట్ నియంత్రణ మండలి ( బీసీసీఐ): ఆటగాళ్లు, అధికారులు నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే ప్లేయర్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.1 కింద రియాన్ పరాగ్‌పై లెవెల్ 1 నేరం రుజువైంది. ఐపీఎల్ 2026కు గానూ.. పరాగ్‌కు రాజస్థాన్ రాయల్స్ నుంచి రూ.14 కోట్ల కాంట్రాక్టు దక్కించుకున్నాడు. ఈ లెక్కన అతడికి ఒక్కో మ్యాచ్‌ ఫీజు సుమారు రూ.కోటి ఉంటుంది. అంటే ప్రస్తుతం అతడికి 25 శాతం జరిమానా అంటే.. దాదాపు రూ. 25 లక్షలు అవుతుంది. ఇది మొదటి తప్పుగా పరిగణించడంతోనే.. రూ. 25 లక్షలు అనేది చాలా పెద్ద ఫైన్. 

ఇక రియాన్ పరాగ్‌పై కఠిన చర్యలు తప్పవని అందరూ అనుకున్నారు. కానీ డ్రెస్సింగ్ రూమ్‌లో ధూమపానంపై ఎలాంటి నిబంధన లేనందున, కోడ్‌ ఆఫ్ కండక్ట్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించని నేరాలను కవర్ చేసే ఆర్టికల్ 2.21ను పరాగ్ కి బీసీసీఐ వర్తింపజేసింది. రియాన్ కి ఈ విషయంపై ఇవాళ(2026, ఏప్రిల్ 30న) ఉదయం.. బీసీసీఐ నోటీసులు ఇచ్చింది. దీనిపై అతడు అప్పీల్ చేసుకునే ఛాన్స్ ఉంది. కానీ అలా చేస్తే దీనిపై మరింత దర్యాప్తు చేసి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే పరాగ్.. అప్పీల్ చేయకుండా జరిమానా చెల్లించి ముందుకు వెళ్లే ఛాన్స్ ఉంది. 

కాగా ఐపీఎల్ ప్రతిష్ట చెక్కుచెదరకుండా ఉండేందుకు, తప్పు చేసిన జట్టు, దాని అధికారులు, ప్లేయర్స్ పై కఠిన చర్యలు తీసుకునేందుకు బీసీసీఐ ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తుంది. ఈనెల 28వ తేదీన పంజాబ్ కింగ్స్‌, రాజస్థాన్ రాయల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో పరాగ్.. ఈ– సిగరెట్ తాగుతూ కనిపించడంతో పాటు సహచర ప్లేయర్స్ పక్కనే ఉన్నా.. అతడు ఈ పని చేసినట్లు ఆ వీడియోలో క్లియర్ గా కనిపించింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన బీసీసీఐ.. ఈ మేరకు కఠిన చర్యలు చేపట్టింది.