V6 News

కాసేపట్లో RCB vs GT మ్యాచ్.. ఆ జట్టుకే గెలిచే ఛాన్స్ ఉంది..  

కాసేపట్లో RCB vs GT మ్యాచ్.. ఆ జట్టుకే గెలిచే ఛాన్స్ ఉంది..  

RCB vs GT: ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2026లో భాగంగా కాసేపట్లో (2026, ఏప్రిల్ 30) అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఒక ఆసక్తికరమైన పోరు జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తమ సొంత గడ్డపై ఆడుతున్న గుజరాత్ టైటాన్స్ (GT) తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది. కాగా, గత మ్యాచుకి ప్రతీకారం తీర్చుకోవాలని గుజరాత్ చూస్తుంది. 

కాగా ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచుల్లో 6 విజయాలతో రెండో స్థానంలో కొనసాగుతుంది ఆర్సీబీ. గత మ్యాచ్‌లో ఢిల్లీని కేవలం 75 పరుగులకే కుప్పకూల్చి, నెట్ రన్ రేట్‌ను (+2) భారీగా పెంచుకుంది. ఇక గుజరాత్ టైటాన్స్ మాత్రం 8 మ్యాచుల్లో 4 విజయాలు, 4 ఓటములతో ఐదో స్థానంలో ఉంది. నిలకడలేమితో సతమతమవుతున్న టైటాన్స్‌కు ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. అయితే ఈ సీజన్‌లో ఇక్కడ జరిగిన 3 మ్యాచుల్లో రెండింటిలో మొదట బ్యాటింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి. చారిత్రాత్మకంగా కూడా ఇక్కడ తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు ఆర్సీబీ రికార్డు బాగుంది. పిచ్ స్వభావాన్ని బట్టి (ఎర్ర మట్టి లేదా నల్ల మట్టి) నిర్ణయం మారవచ్చు, కానీ టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేసేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తాయి.  

ఏ జట్టు గెలుస్తుందంటే?:
ప్రస్తుతం ఆర్‌సీబీ తిరుగులేని ఫామ్‌లో ఉంది. ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్ లాంటి బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. మరోవైపు గుజరాత్ జట్టు కేవలం తన టాప్-3 బ్యాటర్లపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. పవర్‌ప్లేలో గుజరాత్ టైటాన్స్ వికెట్లు కోల్పోకుండా ఆడితేనే గట్టి పోటీ ఇవ్వగలదు. కానీ, అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తున్న డిఫెండింగ్ ఛాంపియన్ బెంగళూరుకే ఈ మ్యాచ్‌లో గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.