V6 News

34 ‑33తో గెలిచిన పుణెరి పల్టాన్‌

34 ‑33తో గెలిచిన పుణెరి పల్టాన్‌

బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌‌‌‌‌‌ (పీకేఎల్‌‌‌‌)లో తెలుగు టైటాన్స్‌‌‌‌కు ఫస్ట్‌‌‌‌ ఓటమి ఎదురైంది. శనివారం జరిగిన లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో పుణెరి పల్టాన్‌‌‌‌ 34–33 తేడాతో టైటాన్స్‌‌‌‌పై గెలిచింది. లాస్ట్‌‌‌‌ మినిట్‌‌‌‌ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌‌‌‌లో టైటాన్స్‌‌‌‌ లాస్ట్‌‌‌‌ రైడ్​ పాయింట్‌‌‌‌ సాధించలేకపోయింది. రైడింగ్​లో సిద్దార్థ్‌‌‌‌ దేశాయ్‌‌‌‌ (15) అదరగొట్టాడు. సురీందర్‌‌‌‌ సింగ్‌‌‌‌ (2), అంకిత్‌‌‌‌ బెనివాల్‌‌‌‌ (2) ఫర్వాలేదనిపించారు. పుణె తరఫున కెప్టెన్‌‌‌‌ రాహుల్‌‌‌‌ చౌదరి (15), డిఫెండర్‌‌‌‌ అభినేశ్‌‌‌‌ (5) చెలరేగారు. అస్లామ్ 8 పాయింట్లతో అండగా నిలిచాడు. సెకండ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో యూపీ యోధా 36–35తో పట్నా పైరేట్స్‌‌‌‌పై గెలిచింది. మోనూ గోయత్​ (5), ప్రశాంత్‌‌‌‌ కుమార్‌‌‌‌ (8), సచిన్‌‌‌‌ (10) పట్నాకు పాయింట్లు అందించారు. యూపీ టీమ్‌‌‌‌లో ప్రదీప్‌‌‌‌ నర్వాల్‌‌‌‌ (12), అషు సింగ్‌‌‌‌ (3), శ్రీకాంత్‌‌‌‌ జాదవ్‌‌‌‌ (3) ఓ మాదిరిగా ఆడారు. థర్డ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో జైపూర్‌‌‌‌ పింక్‌‌‌‌ పాంథర్స్‌‌‌‌ 40–38తో హర్యానా స్టీలర్స్‌‌‌‌కు చెక్‌‌‌‌ పెట్టింది. దీపక్‌‌‌‌ హుడా 10 పాయింట్లతో జైపూర్‌‌‌‌ విక్టరీలో కీ రోల్‌‌‌‌ పోషించాడు. అర్జున్‌‌‌‌ 5 పాయింట్లతో అండగా నిలిచాడు. హర్యానా టీమ్‌‌‌‌లో వికాస్‌‌‌‌ 14 పాయింట్లు తెచ్చినా టీమ్‌‌‌‌ను గెలిపించలేకపోయాడు.