పుట్టగొడుగుల సాగుపై 10 రోజుల ట్రైనింగ్.. ఫిబ్రవరి 18 నుంచి 28 వరకు శిక్షణ

పుట్టగొడుగుల సాగుపై 10 రోజుల ట్రైనింగ్.. ఫిబ్రవరి 18  నుంచి 28  వరకు  శిక్షణ

గండిపేట, వెలుగు: హైదరాబాద్ రాజేంద్రనగర్​లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రి వర్సిటీలో పుట్టగొడుగుల సాగుపై పది రోజుల ట్రైనింగ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.  ఫిబ్రవరి 18  నుంచి 28  వరకు ఈ శిక్షణ నిర్వహిస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అప్లికేషన్ ఫారమ్​లు అందించాలని కోరారు. వచ్చే నెల 8వ తేదీ వరకు దరఖాస్తులకు చివరి తేదీగా నిర్ణయించారు.  మరింత సమాచారం కోసం వర్సిటీ వెబ్​సైట్​చూడాలని సూచించారు.