ఫారిన్ యువతులతో హైదరాబాద్‎లో వ్యభిచారం.. 9 మందిని రెస్క్యూ చేసిన పోలీసులు

ఫారిన్ యువతులతో హైదరాబాద్‎లో వ్యభిచారం.. 9 మందిని రెస్క్యూ చేసిన పోలీసులు

మాదాపూర్, వెలుగు: విదేశాలతో పాటు మన దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి అమ్మాయిలను హైదరాబాద్‎కు రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను సైబరాబాద్​యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్​పోలీసులు అరెస్ట్​ చేశారు. నిర్వాహకుల చెర నుంచి 9 మంది యువతులను రెస్క్యూ చేసి కాపాడారు. నిందితులను మాదాపూర్​పోలీసులకు అప్పగించారు. మాదాపూర్​పర్వత్​నగర్‎లోని బీఎస్‎ఆర్​సూపర్​లగ్జరీ అండ్​లివింగ్​హోటల్‎లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో సైబరాబాద్​ఏహెచ్టీయూ పోలీసులు గురువారం రైడ్​ చేశారు.

ఈ రైడ్‎లో వెస్ట్​బెంగాల్‎కు చెందిన ఇద్దరు, ఢిల్లీకి చెందిన ఇద్దరు, జార్ఖండ్, హర్యానా, పంజాబ్​ రాష్ట్రాలకు చెందిన ఒక్కొక్కరు, ఉజ్బకిస్థాన్​ దేశానికి చెందిన ఒకరు, తుర్కమినిస్థాన్​దేశానికి చెందిన ఒక యువతి.. మొత్తంగా 9 మంది యువతులను రెస్క్యూ చేసి కాపాడారు. ఆర్గనైజర్​హమీర్​సింగ్, సూపర్​వైజర్​శ్రీనివాస్‎తో పాటు మరో ఏడుగురిని అదుపులోకి తీసుకొని మాదాపూర్​పోలీసులకు అప్పగించారు. 

దేశంలోని వివిధ రాష్ట్రాలు, ఇతర దేశాల యువతులకు డబ్బుల ఆశ చూపించి హైదరాబాద్‎కు రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. లోకాంటో, స్కోక్కా వెబ్​సైట్లలో ప్రకటనలు పోస్టు చేసి కాల్స్, వాట్సాప్​ద్వారా హోటల్స్​, ఓయో రూంలలో కస్టమర్ల వద్దకు అమ్మాయిలను పంపింస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.