బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత :  ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత :  ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

భూపాలపల్లి రూరల్, వెలుగు: బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మంగళవారం భూపాలపల్లి కలెక్టరేట్ ఐడీవోసీ ఆఫీస్​లో ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ జయశంకర్ భూపాలపల్లి ఆధ్వర్యంలో నిర్వహించిన స్నేహ బాలల హక్కుల సదస్సు, మాక్ పార్లమెంట్ కార్యక్రమానికి కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్నారుల్లో నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, ప్రజాస్వామ్యంపై అవగాహన పెంపొందించేందుకు మాక్ పార్లమెంట్ వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో పీడీ, డీడబ్ల్యూవో మల్లీశ్వరి, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.