అంకూర పిల్లల ఆస్పత్రిలో దారుణం.. రెండు రోజుల వ్యవధిలో కవలలు మృతి

అంకూర పిల్లల ఆస్పత్రిలో దారుణం.. రెండు రోజుల వ్యవధిలో కవలలు మృతి

హైదరాబాద్:  పీర్జాదిగూడ అంకూర పిల్లల హాస్పిటల్ లో దారుణ సంఘటన చోటుచేసుకుంది.  చికిత్స పొందుతూ రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు కవల శిశువులు మరణించారు. దీంతో  అంకూర పిల్లల ఆస్పత్రి దగ్గర ఆందోళనకు దిగారు బాధితులు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల తమ కవల పిల్లలు చనిపోయారని ఆరోపించారు.  యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం మల్యాల గ్రామానికి చెందిన జెళ్ల కిరణ్ కుమార్, ఉపేంద్ర దంపతులకు వారం రోజుల కిందట హబ్సిగుడ లోని పద్మజ హస్పటల్లో ఉపేంద్రకు కవలలు పుట్టారు. 

శిశువులిద్దరూ అనారోగ్యంగా ఉండటంతో పీర్జాదిగూడలోని అంకురా హస్పటల్ కి తరలించారు. వారం రోజులుగా అక్కడే ఉన్నారు. రెండు రోజుల క్రిత్రం ఒక శిశువు మరణించింది.  ఆదివారం మరో శిశువు చనిపోయింది. చికిత్స కోసం 5 లక్షలు చెల్లించినప్పటికీ శిశువు మృతదేహం ఇవ్వాలంటే మరో లక్షా 40 వేలు ఇవ్వాలని హస్పటల్ యాజమాన్యం డిమాండ్ చేస్తోందంటున్నారు  కిరణ్ కుమార్, ఉపేంద్ర తంపతులు. డబ్బులు కడితేనే మృతదేహాలను ఇస్తామంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.