నవగ్రహ విగ్రహాల ధ్వంసాన్ని నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ పిలుపునిచ్చిన శంషాబాద్ బంద్బుధవారం ప్రశాంతంగా ముగిసింది. స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలు, వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్పాటించారు. శంషాబాద్వీధుల్లో నిర్వహించిన శాంతియుత ర్యాలీలో హిందూ సంఘాలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జైశ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్చేశారు.
