సమ్మర్ హాలిడేస్ లోనే టీచర్లకు బదిలీలు నిర్వహించాలి : చెన్నయ్య

సమ్మర్ హాలిడేస్ లోనే టీచర్లకు బదిలీలు నిర్వహించాలి : చెన్నయ్య

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈ వేసవి సెలవుల్లోనే టీచర్లకు బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టాలని పీఆర్టీయూటీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.చెన్నయ్య ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం ఎల్​బీనగర్​లో రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ...రెండేండ్ల నుంచి టీచర్లకు రావాల్సిన బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలని కోరారు.

 టీచర్ల ట్రైనింగ్ షెడ్యూల్ ముందుగా ప్రకటించకపోవడంతో కొందరు టీచర్లు అందుబాటు లేరని, వారికి స్పెల్స్ మార్చుకునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలకు డీఈఓ పోస్టులను మంజూరు చేసి, మూడేండ్లు పూర్తయిన డీఈఓలను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్దుల్లా, ఫైనాన్స్ సెక్రెటరీ పులి దేవేందర్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.