ప్రుడెన్షియల్ చేతికి భారతీ లైఫ్..

ప్రుడెన్షియల్ చేతికి భారతీ లైఫ్..

న్యూఢిల్లీ: బ్రిటన్‌‌‌‌కు చెందిన  బీమా సంస్థ ప్రుడెన్షియల్ పీఎల్‌‌‌‌సీ, భారతీ లైఫ్ ఇన్సూరెన్స్‌‌‌‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయనున్నట్లు ఆదివారం ప్రకటించింది. భారతీ లైఫ్ వెంచర్స్, 360 వన్ అసెట్ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ల నుంచి దాదాపు రూ.3,500 కోట్లకు  75 శాతం వాటాను కొనుగోలు చేయనుంది.  ప్రస్తుతం ప్రుడెన్షియల్ సంస్థకు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్‌‌‌‌లో 22 శాతం మైనారిటీ వాటా ఉంది. 

ఇన్సూరెన్స్ రెగ్యులేటర్‌‌‌‌‌‌‌‌ ఐఆర్‌‌‌‌డీఏఐ  నిబంధనల ప్రకారం.. ఒకే రంగంలోని మరో సంస్థలో మెజారిటీ వాటా తీసుకుంటున్నందున, ఐసీఐసీఐ వెంచర్లలో తన వాటాను 10 శాతం కంటే కిందికి తగ్గించుకోవాల్సి ఉంటుంది. ప్రుడెన్షియల్‌‌ భారతీ లైఫ్‌‌‌‌ ఇన్సూరెన్స్‌‌‌‌లో వాటాలను కొనడానికి  ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌‌‌‌లో తన వాటాలను అమ్ముతుంది. భారత్‌‌‌‌లో లైఫ్,  హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలో విస్తరించాలని కంపెనీ చూస్తోంది.