పుజారా, జడేజాకు ‘నాడా’ నోటీసులు

పుజారా, జడేజాకు ‘నాడా’ నోటీసులు

న్యూఢిల్లీ: బీసీసీఐకి చెందిన ఐదుగురు సెంట్రల్‌‌ కాంట్రాక్ట్‌‌ క్రికెటర్లకు.. నేషనల్‌‌ డోపింగ్‌‌ ఏజెన్సీ (నాడా) నోటీసులు జారీ చేసింది. టెస్ట్‌‌ ప్లేయర్‌‌ చతేశ్వర్‌‌ పుజారా, కేఎల్‌‌ రాహుల్‌‌, రవీంద్ర జడేజాతో పాటు మహిళా క్రికెటర్లు స్మృతి మంధాన, దీప్తి శర్మ ఇందులో ఉన్నారు. లాక్‌‌డౌన్‌‌ టైమ్‌‌లో ‘వేర్‌‌ ఏబౌట్‌‌’ (ఎప్పుడు, ఎక్కడ) అంశాన్ని వెల్లడించనందుకు ఈ చర్యలు తీసుకుంది. అయితే టెక్నికల్‌‌ (పాస్‌‌వర్డ్‌‌) ఇష్యూ వల్ల క్రికెటర్లు వేర్‌‌ ఏబౌట్‌‌ ఫామ్‌‌ను ఫిల్‌‌ చేయలేకపోయారని బీసీసీఐ స్పష్టం చేసింది. ఇందులో ప్లేయర్ల తప్పిదం లేదని చెప్పింది. ‘బీసీసీఐ నుంచి అధికారిక వివరణ వచ్చింది. ప్లేయర్లు ఎదుర్కొన్న ప్రాబ్లమ్‌‌ను చెప్పారు. అయితే వేర్‌‌ ఏబౌట్‌‌ ఫామ్‌‌ను ఏడీఏఎమ్‌‌ఎస్‌‌ సాఫ్ట్‌‌వేర్‌‌లో రెండు రకాలుగా ఫిల్‌‌ చేయొచ్చు. అథ్లెట్స్‌‌ నేరుగా చేయొచ్చు. లేదా అసోసియేషన్లు కూడా ఈ పనిని పూర్తి చేయొచ్చు. కానీ ఇక్కడ ఈ రెండు జరగలేదు’ అని నాడా డీజీ నవీన్‌‌ అగర్వాల్‌‌ పేర్కొన్నారు. మొత్తం110 మంది ప్లేయర్లను నాడాకు చెందిన నేషనల్ రిజిస్టర్‌‌ టెస్టింగ్‌‌ పూల్‌‌ (ఎన్‌‌ఆర్‌‌పీటీపీ) కింద చేర్చారు. వీళ్లందరూ రాబోయే మూడు నెలలో ఎక్కడ ఉంటారనే విషయాన్ని ముందుగానే నాడాకు తెలియజేయాలి.

ఆసిస్ టీ20 వరల్డ్ కప్ నిర్వహిస్తుంది