V6 News

కెప్టెన్ మన్‌ప్రీత్‌కు పంజాబ్ ప్రభుత్వం ప్రమోషన్

కెప్టెన్ మన్‌ప్రీత్‌కు పంజాబ్ ప్రభుత్వం ప్రమోషన్

చండీగఢ్: టోక్యో ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన క్రీడాకారులకు ప్రజలే కాదు.. పాలకులు, ప్రభుత్వాలు బ్రహ్మరథం పడుతున్నాయి. భారత హాకీ జట్టు అసమాన ప్రతిభతో చరిత్రలిఖించే స్థాయి అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన భారత హాకీ జట్టు క్రీడాకారులకు ఊహించని సత్కారాలు, పురస్కారాలు లభిస్తున్నాయి. ఇదే కోవలోనే పంజాబ్ ప్రభుత్వం టోక్యో ఒలింపిక్స్ భారత్‌కు కాంస్య పతకం సాధించి పెట్టిన హాకీ జట్టు కెప్టెన్‌ మన్‌ప్రీత్‌సింగ్‌కు ప్రమోషన్ ఇస్తున్నట్లు ప్రకటించింది.

మన్‌ప్రీత్‌కు ప్రస్తుతం ఉన్న డీఎస్పీ ర్యాంక్ నుంచి ఎస్పీ ర్యాంక్‌కు ప్రమోషన్ ఇస్తామని పంజాబ్ క్రీడల మంత్రి రాణా గుర్మీత్ సింగ్ సోధీ వెల్లడించారు. ఒలింపిక్స్ చరిత్రలో హాకీలో 41 ఏళ్ల తర్వాత భారత్‌కు పతకం తీసుకురావడంలో మన్‌ప్రీత్ సారధ్యంలో జట్టు విశేష కృషి చేసిందని ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నారు. కాంస్యం కోసం జరిగిన పోరులో భారత హాకీ జట్టు జర్మనీని ఓడించి చరిత్ర సృష్టించడం అసాధారణమని.. ఈ స్ఫూర్తిని కొనసాగించే లక్ష్యంలో భాగంగా ప్రమోషన్ కల్పించాలని నిర్ణయించినట్లు మంత్రి రాణా గుర్మీత్ సింగ్ సోధీ తెలిపారు.