చంఢీఘర్: రాజ్య సభ ఎంపీ రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి మధ్య విభేదాలు మరింత ముదురుతున్నాయి. పార్టీ లైన్ క్రాస్ చేశాడన్న ఆరోపణలపై ఇప్పటికే రాజ్య సభలో పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి రాఘవ్ చద్దాను ఆప్ తొలగించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగానే చద్దాకు మరో షాక్ తగిలింది. పంజాబ్లోని ఆప్ ప్రభుత్వం రాఘవ్ చద్దాకు కల్పించిన Z+ కేటగిరీ సెక్యూరిటీని ఉపసంహరించుకుంది. చద్దా పంజాబ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తు్న్నారు. ఆప్ హైకమాండ్, చద్దా మధ్య అంతర్గత విభేదాల తారాస్థాయికి చేరిన వేళ పంజాబ్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ALSO READ : నువ్వు ఎంత మంచి ఆటో డ్రైవర్ భయ్యా..
చద్దాకు కేంద్రం Z సెక్యూరిటీ:
ఎంపీ రాఘవ్ చద్దాకు పంజాబ్ ప్రభుత్వం Z+ సెక్యూరిటీని ఉపసంహరించుకున్న వెంటనే కేంద్ర ప్రభుత్వం అతడికి Z కేటగిరీ భద్రతను కల్పించింది. చద్దాకు ముప్పు పొంచి ఉందన్న ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. పారా మిలిటరీ బలగాలు చద్దాకు రక్షణ కల్పించనున్నాయి.
ALSO READ : రోజుకు రూ.16 వందల కోట్ల నష్టం..
కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు అమల్లోకి వచ్చే వరకు చద్దాకు తక్షణ భద్రత కల్పించాలని ఢిల్లీ పోలీసులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. రాఘవ్ చద్దాకు పంజాబ్ ప్రభుత్వం జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉపసంహరించుకోవడం ఆ వెంటనే అతడికి కేంద్రం జెడ్ కేటగిరీ భద్రత కల్పించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే రాఘవ్ చద్దా బీజేపీ గూటికి చేరే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

