డిగ్రీ కాలేజీల్లో పీజీ కోర్సులను ఎత్తివేస్తరా?

డిగ్రీ కాలేజీల్లో పీజీ కోర్సులను ఎత్తివేస్తరా?

డిగ్రీ కాలేజీల్లో నడుస్తున్న పీజీ కోర్సులను ఎత్తివేయాలనే ఆలోచనను వెంటనే విరమించుకోవాలని లెఫ్టిస్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ (ఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ఐ, పీడీఎస్‌‌‌‌యూ, టీవీవీ, ఏఐడీఎస్‌‌‌‌ఓ, ఏఐఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌, పీడీఎస్‌‌‌‌యూ) నేతలు డిమాండ్‌‌‌‌ చేశారు. ఈ మేరకు మంగళవారం కళాశాల విద్యాశాఖ కమిషనరేట్​(విద్యాభవన్‌‌‌‌)ను ముట్టడించారు. నాంపల్లి నుంచి ర్యాలీగా వచ్చిన నేతలను విద్యాభవన్ గేటు దగ్గరే పోలీసులు అడ్డుకుని, అరెస్టు చేసి నాంపల్లి పీఎస్ కు తరలించారు. రాష్ట్రంలోని 40 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పీజీ కోర్సులు కొనసాగుతున్నాయని, ఇందులోంచి 20 డిగ్రీ కాలేజీల్లో పీజీ కోర్సులను ఎత్తివేసేందుకు కళాశాల విద్యాశాఖ కమిషనర్‌‌‌‌ నవీన్‌‌‌‌మిట్టల్‌‌‌‌ ఉత్తర్వులిచ్చారని పీడీఎస్‌‌‌‌యూ రాష్ర్ట అధ్యక్షుడు పరుశురాం మండిపడ్డారు. దీంతో 1600 సీట్లు రద్దయ్యే అవకాశముందని, 500 మంది వరకు ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. పీజీ కోర్సులు ఎత్తివేయాలన్న ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.