V6 News

WBC క్వార్టర్‌ ఫైనల్లో పీవీ సింధు ఓటమి

WBC క్వార్టర్‌ ఫైనల్లో పీవీ సింధు ఓటమి

స్పెయిన్‌లోని హుఎల్వా వేదికగా జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్ షిప్( WBC) 2021 క్వార్టర్‌ ఫైనల్లో పీవీ సింధు ఓడిపోయింది. తైవాన్‌కు చెందిన వరల్డ్‌ నెం1 తైజుయింగ్‌ చేతిలో 21-17,13-21 తేడాతో ఓటమి చెందింది. 42 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తైజుయింగ్‌.. సింధుపై విజయాన్ని సాధించింది. దీంతో WBCలో ఆరో పతకాన్ని చేజార్చుకుంది సింధు.