హైదరాబాద్: టోక్యో ఒలింపిక్స్‌లో ఓ కొత్త షాట్‌తో ప్రత్యర్థులను సర్‌ప్రైజ్ చేస్తానని పీవీ సింధు అంటోంది. సోమవారం 25వ పుట్టినరోజు జరుపుకున్న ఆమె.. ఒలింపిక్ ప్రిపరేషన్స్‌పై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ‘ ఓ విషయాన్ని ఇన్నాళ్లూ దాచిపెట్టా.. అందరినీ సర్‌ప్రైజ్ చేద్దామనుకున్నా. అదేంటంటే ఓ కొత్త షాట్ ఆడటం నేర్చుకున్నా. దానిని చూడాలంటే ఒలింపిక్స్ వరకు ఆగాల్సిందే. కరోనా బ్రేక్ వల్ల గేమ్‌లో టెక్నిక్స్‌పై దృష్టిపెట్టే అవకాశం దొరికింది. గతంలో ఇన్ని రోజులు ఎప్పుడూ ట్రెయినింగ్ తీసుకోలేదు. స్కిల్స్, టెక్నిక్ పరంగా ప్రిపరేషన్ బాగా జరుగుతోంది’ అని సింధు పేర్కొంది. ఒలింపిక్స్‌లో 24వ తేదీ నుంచి బ్యాడ్మింటన్ స్టార్ట్ అవుతుంది.

