పైథాన్, చిరుత ఫైటింగ్.. ఇంతకు ముందు చూసి ఉండకపోవచ్చు..

పైథాన్, చిరుత ఫైటింగ్.. ఇంతకు ముందు చూసి ఉండకపోవచ్చు..

పైథాన్.. ఏ జంతువునైనా చుట్టేసి బొక్కలు చూర చూర చేస్తుంది. చిరుత.. తన పంజాతో అవతలి జంతువును చీల్చి చెండాడుతుంది. మరి ఈ రెండూ ఒకదానితో ఒకటి పోటీపడితే.. అవును..ఇక్కడ అదే జరిగింది. కెన్యాలోని మాసాయి మారా ట్రయాంగిల్ రిజర్వ్ వద్ద ఒక భారీ పైథాన్‌కు మరియు చిరుతపులికి మధ్య అరుదైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధాన్ని ఓ పర్యాటకుడు తన కెమెరాలో బంధించాడు. రిజర్వ్ ఫారెస్ట్‌లో పైథాన్, చిరుత ఒకదానికొకటి ఎదురుపడ్డాయి. పైథాన్ ఒక్కసారిగా చిరుతపై దాడికి ప్రయత్నించింది. వెంటనే అప్రత్తమైన చిరుత కూడా తిరిగి పైథాన్ మీదకు దూకి తనను తాను రక్షించుకుంది. మొదట్లో చిరుత, పైథాన్‌కి చిక్కినట్లు కనిపించింది. కానీ, వెంటనే చిరుత కూడా ఎదురుదాడి చేయడంతో పైథాన్ నుంచి తప్పించుకోగలిగింది. పైథాన్, చిరుతని చుట్టేసే ప్రయత్నం చేసినప్పుడు వెంటనే చిరుత గాలిలోకి ఎగిరి పైథాన్ నుంచి దూరంగా జరిగింది. ఆ సంఘటన మొత్తం మనకు వీడియోలో కనిపిస్తుంది. ఎదురుదాడికి దిగిన చిరుతు, పైథాన్‌ తలను కొరికినట్లుగా కూడా మనం వీడియో చూడవచ్చు. ఇదంతా ఒక సఫారీ టూర్ గ్రూప్ ఈ రిజర్వ్‌లోకి వెళ్లినప్పుడు జరిగిందట. ఆ గ్రూప్‌కు చెందిన వ్యక్తే ఈ సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.