దుండిగల్కు సూరారం సబ్రిజిస్ట్రార్ ఆఫీస్

దుండిగల్కు సూరారం సబ్రిజిస్ట్రార్ ఆఫీస్
  • రిజిస్ట్రేషన్ ఐజీ పర్యటనలో నిర్ణయం

జీడిమెట్ల, వెలుగు: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రాష్ట్ర రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఇన్​స్పెక్టర్ జనరల్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం పర్యటించారు. సూరారం చౌరస్తాలోని కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అద్దె భవనం కావడంతోపాటు ఇరుకుగా ఉండడం, పార్కింగ్ సమస్యతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్యాలయాన్ని మార్చాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. దీంతో నియోజకవర్గంలో ఎక్కడ ఏర్పాటు చేయాలో నిర్ణయించడానికి ఆయన పలు ప్రదేశాలను పరిశీలించారు.

రిజిస్ట్రార్ ఆఫీస్​కు పక్కా భవనం ఏర్పాటు చేసే వరకు సూరారంలో అద్దె భవనంలో కొనసాగుతున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని దుండిగల్​లోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలోకి మార్చాలని నిర్ణయించుకున్నారు. దీంతో త్వరలో సూరారం నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తరలిపోనుంది. ఆయన వెంట మేడ్చల్ జిల్లా రిజిస్ట్రార్ అశోక్ కుమార్, డిప్యూటీ కమిషనర్ ఎన్. వెంకటేశ్వర్ తదితరులు ఉన్నారు.