మోహన్ నాయక్.. అవినీతిలో ఖల్ నాయక్ : ఆస్తుల చిట్టా చూస్తే మీకు కళ్లు తిరగటం ఖాయం..!

మోహన్ నాయక్.. అవినీతిలో ఖల్ నాయక్ : ఆస్తుల చిట్టా చూస్తే మీకు కళ్లు తిరగటం ఖాయం..!

ఆర్ అండ్‌‌‌‌ బీ శాఖ ఇంజినీర్ ఇన్‌‌‌‌ చీఫ్‌‌‌‌ (ఈఎన్సీ) జరుపుల మోహన్‌‌‌‌ నాయక్‌‌‌‌ అవినీతి పుట్ట బద్దలైంది. మియాపూర్‌‌‌‌‌‌‌‌లోని ఆయన నివాసం, నిజామాబాద్‌‌‌‌ సహా మొత్తం 16 ప్రాంతాల్లో  ఏసీబీ అధికారులు ఏకకాలంలో జరిపిన  సోదాల్లో రూ.200 కోట్ల విలువైన అక్రమాస్తులు వెలుగుచూశాయి. మార్కెట్ వ్యాల్యూను పరిగణలోకి తీసుకుంటే వేల కోట్లు అయినా ఉండొచ్చనే ప్రచారం జరుగుతుంది. 

మోహన్ నాయక్ భార్య కూడా ప్రభుత్వం ఉద్యోగం చేశారు. ఆమె వాలంటరీ రిటైర్ మెంట్ తీసుకున్నారు. మోహన్ నాయక్ కూడా ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి పోటీకి సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. 

ఇప్పటి వరకు బయటపడిన మోహన్‌‌‌‌ నాయక్‌‌‌‌ అవినీతి ఆస్తుల చిట్టా :

>>>  మియాపూర్‌‌‌‌‌‌‌‌లోని నివాసంలో రూ.55 లక్షల డబ్బు కట్టలు. 
 >>>  బ్యాంకు అకౌంట్లలో ఒక కోటి 44 లక్షల రూపాయలు డబ్బు.
>>>  24 క్యారట్ల 15 గోల్డ్‌‌‌‌ బిస్కట్లు. 
>>>  రెండున్నర కిలోల బంగారు ఆభరణాలు. 
>>>  ఆరు కేజీల వెండి. 
>>>  ఒక కోటి 26 లక్షల రూపాయల విలువై గృహోపకరణాలు.
>>>  రెండుడు కార్లు
>>>  9 సెల్‌‌‌‌ఫోన్లు
>>>  నాలుగు ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌లు. 
>>>  నిజామాబాద్‌‌‌‌ జిల్లా  డిచ్‌‌‌‌పల్లి మండలం ముల్లంగి గ్రామంలో 19 ఎకరాల 38 సెంట్ల వ్యవసాయ భూమి.
>>>  హైదరాబాద్‌ సిటీ శివార్లలోని‌‌‌ కొంపల్లిలో 3 అపార్ట్ మెంట్ ఫ్లాట్లు
>>>  గచ్చిబౌలి ఏరియాలో 4 అపార్ట్ మెంట్ ఫ్లాట్లుజ
>>>  మియాపూర్‌‌‌ ఏరియాలో 2 కోట్ల 20 లక్షల రూపాయల విలువైన ట్రిపులెక్స్ లగ్జరీ విల్లా.
>>>  నిజామాబాద్‌ సిటీ పరిధిలో కోటి రూపాయల విలువ చేసే లగ్జరీ  విల్లా
>>> హైదరాబాద్ కూకట్ పల్లిలో నిర్మాణంలో ఉన్న భారీ బిల్డింగ్.
>>>  బెంగళూర్‌‌‌‌‌‌‌‌ సిటీలో ఓ అపార్ట్ మెంట్ ఫ్లాట్‌‌
>>>  నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం ముల్లంగి, మోపాల్ మండలం కులాస్ పూర్ దగ్గర 25 ఎకరాల వ్యవసాయ భూమి
>>>  అదే ప్రాంతంలో ఓ లగ్జరీ ఫాంహౌస్.