ఫీజు రీయింబర్స్మెంట్ను నీరుగారుస్తే ప్రభుత్వ పతనం తప్పదు: ఆర్.కృష్ణయ్య

ఫీజు రీయింబర్స్మెంట్ను నీరుగారుస్తే ప్రభుత్వ పతనం తప్పదు: ఆర్.కృష్ణయ్య

బషీర్​బాగ్, వెలుగు: ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని యథావిధిగా అమలు చేయాలని, లేనిపక్షంలో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్​లో జరిగిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. 

ఈ పథకాన్ని నీరుగార్చేలా తెచ్చిన జీవో నంబర్ 7ను వెంటనే ఉపసంహరించుకోవాలని, పెండింగ్​లో ఉన్న రూ. 8 వేల కోట్ల ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థుల ఉన్నత చదువులను అడ్డుకోవాలని చూస్తే ప్రభుత్వ పతనం తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్​గా వంశీ మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేయగా, మండలి ప్రతిపక్ష నేత మధుసూధనచారి, నాయకులు నారగోని, కత్తి వెంకటస్వామి, డా. అరుణ్ కుమార్, గుజ్జ సత్యం పాల్గొన్నారు.